Home » Jaya Shankar
ప్రపంచంలో నేడు రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడుందని భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ప్రశ్నించారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘పదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రపంచప్రఖ్యాత మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై బురద చల్లడం మాని ఇప్పటికైనా అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్ స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్‌నాథ్‌సింగ్ (రక్షణ), నిర్మలా సీతారామన్ (ఆర్థికం), జైశంకర్ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు.
మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్ వర్సిటీ నాణ్యమైన, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం హర్షణీయమని అభినందించారు.