Home » Mancherial
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాకు సరిహద్దున ఉండడం, అక్కడి ప్రజలు ఇక్కడ సత్సంబంధాలతో ఉన్నాయి. మహా రాష్ట్రకు చెందిన పలువురు కూలీలు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉపాధికి వస్తారు. దీంతో ఇక్కడి గ్రామాలు సందడిగా మారాయి. అంతే కాకుండా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 12 గ్రామాల్లో ఓటర్లు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో గురువారం సూపర్ స్పెషాలిటీ, మాతా శిశు ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణానికి చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. బుధవారం ఆసుపత్రి శంకుస్థాపన చేసే ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి కోరారు. బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సీసీఐ ఆధ్వర్యంలో చెన్నూరు కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలన్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమి షనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్ధమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం పట్ట ణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ మాట్లా డుతూ చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పి టల్, మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 21న ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కేంద్రం లోని ఐబీ చౌరస్తా సమీపంలోని పాత ప్రభుత్వ అతిథి గృహ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణా నికి అధికారులు స్థలం ఎంపిక చేశారు.
గ్రామాల్లో పారిశుధ్యం లోపించ కుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశపాండేతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ పరిశుభ్రతతోపాటు నివాస ప్రాంతాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలం లోని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్, రోటిగూడ, పొన్కల్, రేండ్లగూడ, దేవునిగూడ, కవ్వాల్, మొర్రిగూడ గ్రామాల్లో కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించారు.
గ్రామాల్లో విద్య, వైద్యంతోపాటు సాగు నీటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తా నని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంగళవారం స్వగ్రామం నెన్నెల మండ లం జోగాపూర్ వచ్చారు. ఆయనను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నారు.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని అదనపు కలెక్టర్ మోతీ లాల్ రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ద్వారక రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పొలం కోతకు 15 రోజుల ముందే నీటి తడిని నిలిపివేయా లన్నారు.