Share News

విద్య, వైద్యం, సాగు రంగాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Nov 19 , 2024 | 10:10 PM

గ్రామాల్లో విద్య, వైద్యంతోపాటు సాగు నీటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తా నని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంగళవారం స్వగ్రామం నెన్నెల మండ లం జోగాపూర్‌ వచ్చారు. ఆయనను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నారు.

విద్య, వైద్యం, సాగు రంగాల అభివృద్ధికి కృషి

నెన్నెల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విద్య, వైద్యంతోపాటు సాగు నీటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తా నని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంగళవారం స్వగ్రామం నెన్నెల మండ లం జోగాపూర్‌ వచ్చారు. ఆయనను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వంతో చర్చించి పలు సలహాలు, సూచనలు ఇవ్వ నున్నట్టు చెప్పారు. మత్తడివాగు ప్రాజెక్టులో పూడిక చేరడంతో నిల్వ సామర్థ్యం తగ్గి రెండు పంటలకు సరిపడ నీరు ఉండడం లేదన్నారు. పూడిక తీత, కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామీణ పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు మండ లంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పదిమంది పిల్లలకు నగదు ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే వినోద్‌ మాట్లాడుతూ కోదండరాం సూచన మేరకు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తానన్నారు. మత్తడివాగు ప్రాజెక్టు మరమ్మతుకు మంత్రితో చర్చించి నిధులు తీసుకొస్తానన్నారు. జేఏసీ కన్వినర్‌ టి. రణవీర్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గట్ట మల్లేష్‌, నాయకులు బొమ్మెన హరీష్‌గౌడ్‌, తోట శ్రీనివాస్‌, గురునాథం మల్లాగౌడ్‌, రాజన్నయాదవ్‌, సింగతి తిరుపతి, చెన్నోజి శంకరయ్య, హేమలత, ఉయ్యాల మల్లిక పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

జైపూర్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపా ధ్యాయులు, సహ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ మద్దుల సునీత, ప్రధానోపాధ్యాయులు శ్యాంసుం దర్‌, ఉపాధ్యాయులు, విద్యా ర్థులు ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఉదోగుల బదిలీలు, పదోన్నతులు కల్పించిందని ఆయన గుర్తు చేశారు. గత పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేయడం వల్ల సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు మొదట పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పాఠశాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే వివేక్‌ సహకారంతో నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ, నాయకులు పాల్గొన్నారు.

కోదండరాంకు స్వాగతం

మందమర్రి టౌన్‌, (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కోదండరాంకు తెలంగాణ ఉద్యమకారులు ఘన స్వాగ తం పలికారు. జేఏసీ నేత హెచ్‌ రవిందర్‌, సుందిల్ల రాజయ్య, సిరిపురం మల్లయ్య, ఎం శ్యాంసుందర్‌రెడ్డి, చందులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 10:10 PM