Home » Telangana » Adilabad
జిల్లా కార్మిక వర్గానికి వరప్రదాయినిగా చెబుతున్న సిర్పూరు పేపరు మిల్లు(ఎస్పీఎం) ఈ ప్రాంతం ప్రజానీకానికి పరోక్షంగా అనారోగ్యాన్ని ప్రసాదిస్తోంది.
సిర్పూర్(టి), సెప్టెంబరు 6: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలంగాణ ఫైనాన్స్కమిషన్ చైర్మన్ సిరిసిల్లరాజయ్య అన్నారు.
కాగజ్‌నగర్, సెప్టెంబరు 6: కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్‌గా శ్రద్ధా శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ రెవెన్యూ డివిజన్అధికారిగా సురేష్ పనిచేశారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 6: జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు వినాయకచవితి ఉత్సవాలను జరుపుకోనున్నారు.
జైనూరు/ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 6: జైనూరు మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.
మరణించిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని విరాసత్ చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన సంఘటన దండేపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ తతంగం తహసీ ల్దార్ కార్యాలయ సిబ్బందే నడిపించగా, విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గణపతి నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైం ది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా గణపతి ప్రతిమకు భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు. గణ పతి మండళ్ళను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో నిర్వా హకులు ముస్తాబు చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 9 గం టల నుంచి 12 గంటల వరకు చవితి శుభ గడియలో ఆయా మండ పాల్లో గణపతి విగ్రహాలను నెలకొల్పనున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వం శీకృష్ణ అన్నారు. శుక్రవారం 5వ వార్డు గెర్రె కాలనీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.31 కోట్లతో నిర్మిం చనున్న వాటర్ ట్యాంకు పనులను ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ప్రారంభించారు.
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో మాట్లాడారు.
గణపతి ఉత్సవాలను, నిమజ్జనాన్ని ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. సంతోషి మాత ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మండపాల వద్ద ఎలాంటి గొడవలకు తావివ్వకూడదన్నారు.