Kumaram Bheem Asifabad: మత్స్యకారులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే హరీష్‌బాబు
ABN , Publish Date - Nov 20 , 2024 | 10:50 PM
పెంచికలపేట/దహెగాం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మత్స్య కారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు
పెంచికలపేట/దహెగాం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మత్స్య కారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బుధవారం పెంచికలపేట, దహెగాం మండలాల్లోని రైతువేదికల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెంచికలపేట మండలం ఎల్లూరు బొక్కివాగు ప్రాజె క్టులో చేప పిల్లలను విడిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించేందుకు అందరం కృషి చేయా ల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఉపాధి పొందవచ్చని ఆయన అన్నారు. చెరువులలో చేపపిల్లలను వదిలే ముందు మత్స్యకార్మిక సంఘాల సభ్యులు వాటి నాణ్యతను పరిశీలించా లని సూచించారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. అలాగే గ్రామాల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. అంతర్గత రోడ్లు, శిథిలావస్థలో ఉన్న గ్రామపంచాయతీ భవనాలవివరాలను అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో నాయకులు మధుకర్, రాజన్న, సత్యనారా యణ, ప్రభాకర్‌గౌడ్, నగేష్, మహేష్, గణపతి, పురుషోత్తం, కాంతారావు, సంతోష్, బాపూజీ తదితరులు పాల్గొన్నారు.
దహెగాంమండలంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని కోత్మీర్-దహెగాం డబుల్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడంలో కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని, అతన్ని తొలగించి మరో కాంట్రాక్టర్‌కు డబుల్‌రోడ్డు నిర్మాణ పనులు అప్పగించాలని సీఈకి తెలిపినట్లు తెలిపారు. మండలంలోని లగ్గాం అప్రోచ్ వద్ద నిర్మాణం చేపడుత్ను వంతెన నిర్మాణంలో భూములు నష్టపోతున్న రైతులకు పరిహారం అందించడానికి కృషిచేస్తానని రైతులకు హామీఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ కవిత, ఎంపీడీఓ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ ధనుంజయ్, ఎంఆర్ఐ శృతి, ఎంసీ ధన్‌రాజ్, నాయకులు సంజీవ్, సత్యనారాయణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.