Home » Medical News
అత్యాధునిక కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ ఉపయోగించి రూపొందించిన ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
వైద్య ఆరోగ్యశాఖలోని వైద్యవిద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో జరిగిన సాధారణ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న నాటి ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి.
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు దూకుడుగా పని చేస్తోంది. ఒక దాని తర్వాత మరొకటి.. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ రాత పరీక్షలు నిర్వహిస్తూ నియామకాలు పూర్తి చేస్తోంది.
మూర్ఛ వ్యాధి ఒక సామాజిక సవాలుగా మారిందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. మూర్ఛకు అత్యుత్తమ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండుకొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు.
ఆరోగ్య సమస్యలను, వ్యాధులను నయం చేస్తాయంటూ పలు కంపెనీలు విక్రయిస్తున్న హెల్త్ సప్లిమెంట్లను ఔషధాల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు చేసింది.
ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.
రాష్ట్రంలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ఆరోగ్య శాఖ నజర్ పెట్టింది. నకిలీ, నాసిరకం మందులను ఎక్కువ ధరకు అమ్మే వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 72 నూతన వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) వెల్లడించింది.