Home » National Investigative Agencies
ఈ ఏడాది ఏప్రిల్ 24న అర్ధరాత్రి ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కేసులో ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
పంజాబ్లో విశ్వహిందూ పరిషత్ (VHP) నేత వికాస్ ప్రభాకర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం విడుదల చేసింది. వీరు ఎక్కడున్నా ప్రాణాలతో పట్టిస్తే రూ.10 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసి్స’లో కరుడుగట్టిన సభ్యులుగా పనిచేస్తున్న 17 మందిపై ఎన్ఐఏ సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. బాంబులు తయారు చేయడం, యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం,
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.
సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కొత్త ఫోటోలను దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారంనాడు విడుదల చేసింది. మార్చి 1న జరిగిన ఈ పేలుడులో సుమారు 10 మంది గాయపడ్డారు. 3వ తేదీన కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో గత వారం భారీ పేలుడుకు కారణమైన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నగదు బహుమతిని ప్రకటించింది. సమాచారం అందించిన వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తామని తెలిపింది. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
రాజస్థాన్లోని జైపూర్లో ఇటీవల సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో కుమార్ అనే కీలక అనుమానితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారంనాడు అరెస్టు చేసింది. కుమార్ నివాసంలో పలు ఆయుధాలు, అమ్యునేషన్ స్వాధీనం చేసుకుంది.
రాజస్థాన్లోని జైపూర్లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేది హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించినట్టు కేంద్ర హోం శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ నేరంలో గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున కేసు మొత్తం యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించినట్టు తెలిపింది.
ఎయిర్ ఇండియా ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన ఖలిస్థాన్ అనుకూల నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దేశంలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ...