Home » Parliament
పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25వ తేదీ నుంచి డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు.
సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఓబీసీ క్రీమీలేయర్ విధానాన్ని అమలుచేయడంలో వారి తల్లిదండ్రుల ‘వేతనాన్ని’ పరిగణనలోకి తీసుకునే విషయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు జరగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం నవంబరు 26న పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
వక్ఫ్ సవరణ బిల్లుపై సోమవారం జరిగిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు.
పార్లమెంటులోని తన గదిలోకి కొందరు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ కు లేఖ రాశారు.
వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశం కొన్ని సాంకేతిక కారణాల వల్ల నేటికి వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం సెప్టెంబర్ 19, 20 2024 తేదీల్లో జరుగనుంది. ఈ భేటీలో కీలక విషయాలను సేకరించి, నిర్ణయం తీసుకోనున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.
పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని(Public Accounts Committee) ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం ప్రకటన జారీ చేశారు.