Home » Postponed
రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించనున్న మహాదర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకుని దర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ పేర్కొంది.
టీడీపీ, వైసీపీ నాయకుల తీవ్ర పోటీ వల్ల కొత్తూరు విద్యాకమిటీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. మండలంలోని కొత్తూరు విద్యాకమిటి ఛైర్మన్ ఎన్నికలు ఈ సారి కూడా వాయిదా పడ్డాయి. పోరుమామిళ్ల మండలంలోని కొత్తూరు (సిద్దనకిచ్చాయపల్లె) విద్యాకమిటీ ఛైర్మన్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు తీవ్రంగా పోటీ పడడంతో రెండు దఫాలుగా ఈ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి.
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు బుధవారం కూడా ఓయూలో ఆందోళన కొనసాగించారు.
ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
తెలంగాణ(telangana)లో గ్రూప్ 1 ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్(PGECET 2024) ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పీజీఈసెట్ 2024 పరీక్షల షెడ్యూల్ తేదీల్లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి ప్రకటించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అధికారిక భూటాన్ పర్యటన వాయిదా పడింది. భూటాన్‌లోని పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో పర్యటన వాయిదా పడినట్టు విదేశాంగ కార్యాలయం బుధవారంనాడు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఇండియా కూటమి సమావేశం వాయిదా పడింది. ఈనెల 6వ తేదీ బుధవారం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, కీలక నేతలు అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశం వాయిదా పడినట్టు కూటమి వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించాలని భావించారు.