Home » Protest
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గురువారం శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు.
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్ఎస్ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ అందించినట్టు సమాచారం.
పీసీఎస్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉండగా.. రివ్యూ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ-ఏఆర్ఓ) ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 22, 23 తేదీల్లో మూడు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.
అమరావతి: విజయవాడలో నడక కోసం లయోలా కాలేజ్ వాకర్స్ పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 25 సంవత్సరాలుగా నగరవాసులు లయోలా కాలేజ్ వాకర్స్ పేరుతో లయోలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు. అయితే కోవిడ్ సాకుతో కాలేజ్ యాజమాన్యం వాకర్స్‌ని కాలేజీలోకి రాకుండా ఆంక్షలు విధించింది.
దళిత బంధు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ధర్నా, రాస్తారోకోకు పిలుపునిచ్చారు.
మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయామంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో తమకు రక్షణ లేకుండా పోయిందని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం తమను దాడులు, వేధింపుల నుంచి రక్షించాలని, హిందూ సమాజ నాయకులపై దేశద్రోహ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 30 వేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపై బాధితులతో కలిసి మహా ధర్నాకు బీజేపీ ప్లాన్ చేసింది. శుక్రవారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బాధితులతో మహాధర్నా నిర్వహిస్తారు.
వానాకాలం పంట సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ప్రభుత్వం ఎగ్గొట్టిందని, దీనికి నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలని నిర్ణయించింది. వానాకాలం పంట సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి చెప్పడం అంటే మోసం చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు దీక్ష నిర్వహించనుంది. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొననున్నారు.