Home » Ramakrishna
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున హైదరాబాద్ రాజధాని డ్రామాకు వైసీపీ తెరలేపిందన్నారు.
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వరం మారిందని.. ఓటమి గ్రహించారని.. అందుకే వైసీపీ అభ్యర్థులను సీఎం మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.
Andhrapradesh: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలం శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.
Andhrapradesh: అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డే అని అని మండిపడ్డారు.
Andhrapradesh: అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారన్నారు.
అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ, మునిసిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి రాజధాని రైతులకు జనవరి 5వ తేదీ లోపు కౌలు చెల్లించాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) తెలిపారు. ఆదివారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లుకు చేరుతుందని ముందునుంచే చెబుతున్నామని.. అయితే ఆయన దాన్ని మించి 11 లక్షల కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా తీసుకున్నాడని వాటిని ఏం చేశాడో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అరాచకం రాజ్యం ఏలుతుందా’’ అనే అంశంపై ఆదివారం నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) హామీ ఇచ్చి మరి ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) తెలిపారు.