Home » Rs2000 note
రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన చేసింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు ఈనెల 30వ తేదీన ముగియనుండటంతో గడువును అక్టోబర్ 7వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ శనివారంనాడు ప్రకటించింది.
సెప్టెంబర్ ముగిసిన తరువాత కూడా 2వేల నోట్లను ఎక్కడెక్కడ తీసుకుంటారు? అసలు నోట్ల డిపాజిట్ సమయం ముగిసిన తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి?
ఉన్నపళంగా రూ.2 వేల నోటు ఉపసంహరించడం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏమైనా ప్రభావం చూపుతుందా?.. అనే ప్రశ్నకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) సమాధానమిచ్చారు. పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయం ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే మూడింట రెండొంతుల రూ.2000 నోట్లు వ్యవస్థలోకి వచ్చిచేరాయని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2 వేల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes) అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI) కీలక రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో డిపాజిట్లు, రుణాలు, వినియోగంపై ఈ పెద్ద నోటు ఉపసంహరణ గణనీయ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. వినియోగ డిమాండ్ రూ.55 వేల కోట్ల మొత్తంలో పెరగొచ్చని విశ్లేషించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ ఫలితాల్లో వినియోగ డిమాండ్ తక్షణం పెరుగుదల ఒకటని తెలిపింది.
మార్కెట్లో రూ.2వేల నోట్ల చెలామణిని రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో..
రెండు వేల రూపాయల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes withdrawal) అసత్యాలు ప్రచారమవుతున్న వేళ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది.
‘‘ రూ.2000 నోట్లు తీసుకోబడవ్’’ అంటూ హైదరాబాద్‌లోని (Hyderabad) ఇందిరాపార్క్ ఏరియాలో ఫేమస్ అయిన ‘ప్రమద’ (pramada) అనే స్వీట్ షాప్ పేపర్ నోటీస్ అంటించడం చర్చనీయాంశమైంది.