Home » Shimla
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కలల ప్రాజెక్టుకు రెక్కలొచ్చాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సిమ్లా రోప్‌వే కోసం ముందస్తు టెండర్‌ను ఆమోదించింది. దీంతో దేశంలోనే మొదటి, ప్రపంచంలోనే రెండో పొడవైన రోప్‌వే నిర్మాణం మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మసీదు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలోని మండిలో శుక్రవారం నిరసన ప్రదర్శనలకు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నారు. పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ప్రదర్శకులు ముందుకు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు.
సంజౌలి ప్రాంతంలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించేందుకు పలు హిందూ సంస్థలు ధల్లి ఏరియాలో సమావేశం కావడం, ఇందుకు ప్రతిగా ధల్లి టన్నెల్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రికత్త నెలకొంది.
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్‌స్టతో కులు, పధార్, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 45 మంది గల్లంతవగా.. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి.
మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో ఆయన రెండు కెబినెట్లలలో పని చేసిన వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. అందులో పలువురు కీలక నేతలున్నారు.
దేశాభివృద్ధికి పాటు పడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ(PM Modi) ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) పర్యటించారు.
న్యూఇయర్ వేడుకలకు ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లా ముస్తాబైంది. దాదాపు 80 వేల నుంచి లక్ష మంది టూరిస్టులు సిమ్లా(Shimla)లో పర్యటిస్తారనే అంచనాల నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో ఈ ఏడాది ప్రథామార్థంలో కురిసిన భారీ వర్షాలకు పర్యాటక రంగం(Tourist Department) తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. సిమ్లా(Simla)లో పర్యటకుల సందడి మొదలైంది. వరుస సెలవుల కారణంగా ఆ ప్రాంతానికి సందర్శకుల(Tourists) తాకిడి పెరిగింది.