Share News

Shimla Mosque Row: మసీదులో అక్రమంగా నిర్మించిన రెండు ఫ్లోర్స్ కూల్చివేతకు కోర్టు ఆదేశం

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:31 PM

మసీదు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలోని మండిలో శుక్రవారం నిరసన ప్రదర్శనలకు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నారు. పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ప్రదర్శకులు ముందుకు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు.

Shimla Mosque Row: మసీదులో అక్రమంగా నిర్మించిన రెండు ఫ్లోర్స్ కూల్చివేతకు కోర్టు ఆదేశం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని సంజౌలీ మసీదు వివాదం (Sanjauli Mosque Row) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారంనాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. మసీదులో అక్రమంగా నిర్మిస్తున్న రెండు అంతస్తుల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని మసీదు నిర్వాహకులకు గడువు విధించింది. తీర్పు వెలువరించేంత వరకూ మసీదును సీల్ చేయాలని కమిషనర్ ఇంతకుముందు ఆదేశాలిచ్చారు.

మసీదు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలోని మండిలో శుక్రవారం నిరసన ప్రదర్శనలకు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నారు. పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ప్రదర్శకులు ముందుకు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు.

Karan Dev Kamboj: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఓబీసీ కీలక నేత

అక్రమ కట్టడాలపై చర్యలకు వెనుకాడం: సీఎం

సిమ్లాలోని ఉద్రిక్తత ఘటనలపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పందించారు. సిమ్లాలో మసీదు అక్రమ నిర్మాణం చుట్టూ ఈ పరిణామాలు చేటుచేసుకున్నట్టు చెప్పారు. అదనంగా నిర్మించిన ఫ్లోర్స్‌ను తమంత తాముగా కూల్చేందుకు అనుమతి ఇవ్వాలని కమిషన్‌ను ముస్లిం వర్గాలు కోరాయని తెలిపారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా మత ప్రసక్తి లేకుండా వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర సంస్కృతి, శాంతి-సామరస్యాలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు పాటుపడాలని కోరారు. చట్టానికి లోబడి హిమాచల్ ప్రదేశ్‌లో పనిచేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఈవిషయమై శుక్రవారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర చర్చ జరిపామని, ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనను ఆమోదించామని చెప్పారు. మండి నిరసనకారులపై వాటర్ కెనాన్లు ఉపయోగించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం స్పందింస్తూ, నిరసనలు జరిగిన ప్రతిసారి వాటర్ కెనాన్లు ఉపయోగించడం రివాజేనన్నారు. ఇదేమీ మొదటిసారి కాదని చెప్పారు.

Read MoreNational News and Latest Telugu New

Updated Date - Sep 13 , 2024 | 04:31 PM