Home » Sunday
‘మీకు ఆడేందుకు టైమ్ ఉంటుందా? చదివేందుకు తీరిక దొరుకుతుందా..? అసలు తినేందుకూ..?’ అనంటే డోనాల్డ్ ట్రంప్ ఒప్పుకోడు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నాసరే.. గోల్ఫ్ ఆడందే రోజు గడవదు. పుస్తకం తిరగేయందే నిద్రపట్టదు. పిల్లలతో ఆటలాడకుంటే మనసొప్పు కోదు... ట్రంప్ అన్నిట్లోనూ అసాధ్యుడే!
ఎత్తయిన హోటల్, విశాలమైన హోటల్, అత్యంత ఖరీదైన హోటల్ గురించి ఇప్పటిదాకా విని ఉంటారు. అయితే ప్రపంచంలో కోడిపుంజు ఆకారంలో ఉన్న హోటల్ ఇదొక్కటే. ఫిలిప్పీన్స్లో ఉన్న ఈ వినూత్న హోటల్ ఇటీవలే గిన్నిస్ రికార్డులకెక్కి, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చలికాలం వచ్చిందంటే కాలుష్యం కలవరపెడుతుంది. నగరాలన్నీ పొగమంచుతో నిండిపోతాయి. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ, వాహనాల కాలుష్యం, భవన నిర్మాణ వ్యర్థాలు... ఇవన్నీ కలిసి నగరవాసులకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ నగరంలో ఎక్కువ కాలుష్యం ఉంది? ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? ఓ లుక్కేయండి...
కాలాలతో సంబంధం లేకుండా... తారల చర్మం ఎప్పుడూ కాంతిమంతంగా ఎలా ఉంటుంది? ఈ డౌటనుమానం చాలామంది అమ్మాయిలకు సహజంగానే వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలకు, కేశ సంరక్షణకు వారు పాటించే చిట్కాలేమిటనేది తెలుసుకోవాల్సిందే. కొందరు అందాల భామలు ఇస్తున్న వింటర్ టిప్స్ ఇవి...
‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కళకు అనర్హం’ అంటాడు స్కాట్లాండ్కు చెందిన శిల్పకారుడు డేవిడ్ మాక్. అగ్గిపుల్లలతో మహాత్మాగాంధీ, చార్లీచాప్లిన్, మార్లిన్ మన్రో వంటి ప్రసిద్ధుల ప్రతిమలు రూపొందించడంలో దిట్ట ఆయన. మ్యాచ్స్టిక్స్ కళాఖండాల తయారీలో రకరకాల రంగుల్లో లభించే జపాన్ అగ్గిపుల్లలను వినియోగించాడు.
పడవపై కుదురుగా కూర్చుని, తెడ్డేస్తూ నదిలో ఓ పది నిమిషాలు పాటు నడపడమే ఎంతో కష్టం. అలాంటిది గుమ్మడికాయను పడవగా చేసుకొని... దానిపై ఏకధాటిగా 26 గంటల పాటు ప్రయాణించి ‘ఔరా’ అనిపించాడో పెద్దాయన.
విహార ప్రదేశాలంటే అందమైన సరస్సులు, జలపాతాలు, కట్టడాలే కాదు... యుద్ధభేరి మోగిన ప్రాంతాలు, సైనికుల వీరత్వగాధలు, రక్తం ఏరులై పారిన ప్రదేశాలు కూడా... అలాంటి యుద్ధ స్మారకాలను వీక్షిస్తే... ఉద్వేగభరితంగా మారిపోతాం. చరిత్ర ఘటనలను కళ్లకు కట్టేలా లైట్ అండ్ సౌండ్షో రూపంలో చూస్తుంటే... ఆనాటి యుద్ధ స్మృతులు మనల్ని చుట్టుముడతాయి.
ఇంటి కోసమో, పిల్లల కోసమో, గార్డెన్ కోసమో కాకుండా... పెంపుడు జంతువుల కోసం కూడా అనేక గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఉదాహరణకు వాటి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలన్నా, అవి ఏం కోరుకుంటున్నాయో తెలుసు కోవాలన్నా ఇకపై క్షణాల్లో పనే.
నేను కథలు రాస్తానని మా బంధువుల్లో, స్నేహితుల్లో చాలామందికి తెలుసు. కొందరు అప్పడప్పుడు వాళ్ళకు జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి, దీన్ని నువ్వు చక్కని కథగా రాయవచ్చు అంటుంటారు.
కావలసిన పదార్థాలు: లేత నల్లేరు కాడలు - ఒక కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు - పావు కప్పు చొప్పున. మెంతులు - పావు టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి - 10 రెబ్బలు, చింతపండు - చిన్న నిమ్మకాయంత, కరివేపాకు - గుప్పెడు, ఎండుమిర్చి - 15, ఉప్పు - రుచికి.