Home » Tadipatri
ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని మన్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.
కూతురు నిశ్చితార్ధానికి సిద్ధమైన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
అరటి రైతులకు కాలం కలిసొచ్చింది. ఈ ఏడాది అరటికి లభించిన ధర మరే పంటకూ దక్కలేదు. రెండునెలల వ్యవధిలోనే ధర రెండింతలైంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయి ధర పలుకుతోంది. జూలైలో టన్ను రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలికింది. ప్రస్తుతం రూ.26 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. దాదాపు 35 ఏళ్లుగా ఈ ధర చూడలేదని రైతులు చెబుతున్నారు. ధర నిలకడగా ఉండడం కూడా రైతులకు మేలుచేస్తోంది. ఇన్నాళ్లూ అరకొర ఆదాయం, అప్పులతో అరటిని సాగుచేసిన రైతులకు ఇన్నాళ్లకు కాలం కలిసొచ్చింది. రెండో పంటకూ ...
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు. సాధారణంగా తమ పిల్లలకు దేవుడికి సంబంధించినది కానీ తమ పూర్వీకులకు సంబంధించిన పేరు కానీ పె ట్టుకుంటారు.
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉం టుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు.
జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని..
చదువులను మధ్యలో ఆపేసిన వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న కోర్సుల ద్వారా చదువును కొనసాగించవచ్చునని ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి తెలిపారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు. తాజాగా తాడిపత్రి యువతకు వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎవరూ లేరని రోగులు వాపోయారు. ఇలా అయితే పేదలకు వైద్యం అందేది ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడికి ప్రభుత్వ వైద్యశాలకు బుధవారం సాయం త్రం 4గంటల సమయంలో పలువురు రోగులు వచ్చారు. హాస్పిటల్‌లోని డాక్టర్లు ఉండేగది, ఇంజక్షన్లు వేసే గది తదితర గదులన్నీ మూసి వేసి సిబ్బంది ఎక్కడికో వెళ్లిపోయారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీబీరోడ్డు, యల్లనూరురోడ్డు, పుట్లూరురోడ్డు, మెయినబజారు, గాంధీకట్ట మీదుగా ఊరేగించారు. దాదాపు 200 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.