Home » TATA Group
టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా దేశాభివృద్ధిలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో సైతం కీలకంగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబుతో ఆ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగాలతోపాటు వివిధ కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, చంద్రశేఖరన్ చర్చించారు.
రతన్‌టాటా జీవితంలోని ఏ సంఘటన తీసుకున్నా హృదయం కదిలించే కథలే కనిపిస్తాయి. ఇంట్లో తన ప్రియమైన శునకం మరణించినప్పుడు మూగజీవాల రోదనకు ఆయన గుండె చలించింది. ‘‘మనుషులకేనా? జంతువులకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఎందుకు ఉండకూడదు?’’ అని ఆలోచించారు. దేశంలోనే తొలిసారి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ముంబయిలో ‘స్మాల్ యానిమల్ హాస్పిటల్’ ప్రారంభించారు..
లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.
దేశ రక్షణ రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సైనిక రవాణా విమానాలను తయారు చేసే తొలి ప్రైవేటు కర్మాగారం ప్రారంభమైంది. గుజరాత్‌లోని వడోదరలో సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత రతన్ టాటా(Ratan Tata) మరణించాక ఆయన ఆస్తులు ఎవరికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. మార్కెట్ పరంగా టాటా కంపెనీ విలువ రూ.30 లక్షల కోట్లకుపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆకాశమే హద్దుగా విస్తరించారు. అలాగే దాతృత్వంలో తనకు సాటి లేదని నిరూపించారు. మన దేశంలో ప్రతి రోజు ఎన్నో కోట్ల మంది ఏదో ఒక టాటా ఉత్పత్తిని వాడుతూనే ఉంటారు.
టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్‌గా ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే టాటా సన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు.
రతన్ టాటా మృతి కేవలం దేశానికే కాదని ప్రపంచానికి తీరని లోటని కోమటి జయరాం తెలిపారు. విలువలకు, నీతి నిజాయితీకి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా..
టాటా సంస్థల సారథిగా రతన్‌టాటా ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.. ఆ సవాళ్లనే అవకాశాలుగా మలిచి కంపెనీ అభివృద్ధికి దారులు పరిచారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీకి ముందు రతన్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.