Home » Telangana Police
Jani Master Remand Report: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో నార్సింగి పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. జానీ మాస్టర్ దురుద్దేశంతోనే యువతిని తన అసిస్టెంట్‌గా పెట్టుకున్నట్లు తేల్చారు. అంతేకాదు.. ముంబైలోని ఓ హోటల్లో..
Telangana: నగరంలోని పెద్ద అంబర్‌పేట్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిందితుల కదలికలను చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నామన్నారు.
Telangana: ఛలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలోకి ఇతరులను అనుమతించేదుకు ఖాకీలు నిరాకరిస్తున్నారు.
తమ సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పోలీసు సిబ్బంది తరపున పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
Telangana: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రెవ్ పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి పాకెట్స్, ఈ సిగిరెట్స్, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని గచ్చిబౌలి పోలీసులకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Telangana: యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
Telangana: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా బుల్డోజర్ దృష్టి సారించింది. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసిన హైడ్రా మొత్తం ఆరుగురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి.
Telangana: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు. టిజినాబ్, ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డిలోని 25 పబ్బులపై తనిఖీలు చేపట్టగా... పబ్బుల్లో అనుమానితులు 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది.
Telangana: కిడ్నాప్‌కు గురైన వీసా కన్సల్టెన్సీ యాజమానిని పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీసా మంజూరు కోసం చెల్లించిన రూ.4 లక్షలు తిరిగి ఇవ్వాలని వీసా కన్సల్టెన్సీ యజమాని శివశంకర్ రెడ్డిని కిడ్నాపర్స్ కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేశారు.
సోషల్ మీడియాలో(Social Media) కొందరి విపరీత ధోరణి సమాజంలో ఇతరులకు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది..! ఇందుకు యూట్యూబర్ హర్ష అనే యువకుడి ఘటనే ఉదాహరణ.