Home » Tirupathi News
జాతీయ సంస్కృత యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. వర్సిటీ గరుడాచలం హాస్టల్లోని ఓ గదిలో డ్రగ్స్ ఉన్నాయంటూ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు గణేష్ నేతృత్వంలో నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇచ్చేందుకు పోలీసులు నానా హైరానా పడుతున్నారని ఆమె ఆగ్రహించారు.
తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. పాప వినాశనం వద్ద ఓ వర్గం వారు తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు ఊపందుకున్నాయి. పాప వినాశనంలో 20మందికి పైగా అన్యమతస్తులు పాటలతో రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో వరస అత్యాచార, హత్యాచార ఘటనలపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అత్యాచార ఘటనలు నిర్మూలించడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
మైనర్ బాలికపై అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు సాక్షిలో తప్పుడు కథనం ప్రచురితమైంది. తిరుపతి జిల్లాలోని ఎర్రవారి పాలెంలో ఘటన జరిగినట్టుగా మెయిస్ పేజీలో వార్త ఇచ్చింది. అయితే ఈ వార్తను చూసి సదరు బాలిక తండ్రి షాక్కు గురయ్యాడు.
‘మీ దగ్గర పనిచేసే సర్వేయరే నా స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టేసుకున్నాడు. తహసీల్దారు(Tehsildar) కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడంలేదు. మీరైనా సర్వే చేయించి న్యాయం చేయండి’ అంటూ ఆర్డీవో రామ్మోహన్(RDO Rammohan) ముందు ఓ బాధితుడు ఆవేదన చెందారు.
తిరుపతిలోని శిల్పారామంలో ఆదివారం విషా దం చోటుచేసుకుంది. క్రాస్వీల్ బాక్సు ఊడి పోవడంతో 20 అడుగుల ఎత్తుపై నుంచి పడి ఓ మహిళ చనిపోగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
వడమాలపేటలో చిన్నారిపై హత్యాచారం చాలా బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (ఆదివారం) బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మెంబర్ల పూర్తి జాబితాలు వెల్లడిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 243 జారీ చేశారు.