Home » Vikarabad
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే లగచర్లలో అమాయక గిరిజన రైతుల్ని రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.
తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు.
లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులు తమపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు.
లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
లగచర్ల ఫార్మావిలేజ్ ఘటనలో పోలీసులు శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. పరిగి ఠాణా నుంచి వారిని తరలించి.. కొడంగల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
లగచర్లలో అధికారులపై దాడికి రైతులు, ప్రజలను ఉసిగొల్పడంలో కీలకప్రాత పోషించిన సురేశ్ రాజ్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను.
లగచర్ల ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నాయి.
లగచర్ల ఫార్మావిలేజ్‌లో అధికారులపై దాడి ఘటనను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో.. శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్.ఎం.భగవత్ రంగంలోకి దిగారు.