Home » Vote For Note Case
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు ఈ క్యాష్-ఫర్-ఓట్స్ వివాదం చెలరేగింది. పాల్ఘర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచారంటూ బహుజన్ వికాష్ ఆఘాడి (బీవీఏ) నేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. తావ్డే-బీవీఏ నేతలు-కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది.
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద జల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలైలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై కౌంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం , ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేశారు.
Revanth Reddy Supreme Court: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు (Note for Vote Case) విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది...