Supreme Court: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. మరోసారి..
ABN , Publish Date - Apr 18 , 2024 | 01:25 PM
ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేశారు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 18: ఓటుకు నోటు కేసులో(Vote for Note Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని(Chandrababu) నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం గురువారం నాడు విచారణ చేపట్టింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ల ధర్మాసనం తెలిపింది.
ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఈ కేసు.. ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ సర్కార్ కోరింది.
అయితే, రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేనందున సెలవుల అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర సుప్రీం ధర్మాసనాన్ని కోరారు.
ఇదికూడా చదవండి:
సజ్జలకు బిగ్ షాక్.. రాజీనామా చేస్తారా..?
వైసీపీ లెక్కలు తారుమారు.. ఆందోళనలో అభ్యర్థులు..