Home » YSR Jayanthi
దేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారని, కాలం కాటువేసిందో, దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ ప్రధాని కాకముందే వైఎస్ చనిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని భారీ ఎత్తున నిర్వహించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ జయంతి.. జులై 08వ తేదీన తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అవును.. వైఎస్ ఫ్యామిలీలో (YS Family) విభేదాలు ఉన్నాయని మరోసారి రుజువైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM Jagan Reddy).. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనాలు బోలెడన్ని వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవన్నీ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి (YSR Jayanthi) కార్యక్రమానికి ఇడుపులపాయకు కుటుంబ సభ్యులంతా కాకుండా ఎవరికివారే వెళ్లి నివాళులు అర్పించడం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవన్నీ అటుంచితే..
వైఎస్ జయంతి సందర్భంగా సందేహాలను పటాపంచలు చేస్తూ ఒక పరిణామం చోటుచేసుకుంది. నేడు (జూలై 8, 2023, శనివారం) వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విటర్లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ పరిణామంతో మొత్తానికో క్లారిటీ వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి (YSR Jayanthi) ఒక్కరోజు ముందే వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. జూలై-08న వైఎస్టార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. అధికారిక ప్రకటన ఉంటుందని మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే...