ఎక్స్‌పోజింగ్‌ నావల్ల కాదు... జోగినిగా కొనసాగాలని లేదు

ABN , First Publish Date - 2020-02-07T21:07:25+05:30 IST

జోగిని శ్యామలగా జీవితం ప్రారంభించిన తాను సినిమా శ్యామలగా మారడం సంతోషంగా ఉందని, ఈ గౌరవప్రద స్థానాన్ని జీవితాంతం నిలుపుకుంటానని ‘వీరంగం’ హీరోయిన్‌ శ్యామల పేర్కొన్నారు.

ఎక్స్‌పోజింగ్‌ నావల్ల కాదు... జోగినిగా కొనసాగాలని లేదు

టీవీలో చూసి అవకాశమిచ్చారు

జోగినిని చేసింది నానమ్మే

ట్రాన్స్‌ జెండర్‌ అంటే తెలీదు

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో ‘వీరంగం’ శ్యామల


జోగిని శ్యామలగా జీవితం ప్రారంభించిన తాను సినిమా శ్యామలగా మారడం సంతోషంగా ఉందని, ఈ గౌరవప్రద స్థానాన్ని జీవితాంతం నిలుపుకుంటానని ‘వీరంగం’ హీరోయిన్‌ శ్యామల పేర్కొన్నారు. కుటుంబ గౌరవం నిలిపేందుకు సినిమాల్లో ఎక్కువగా ఎక్స్‌పోజింగ్‌ చేయబోనని, ఇకపై జోగినిగా కొనసాగబోనని ఆదివారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి స్టూడియోలో ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కేలో ప్రకటించారు. 13-02-2012న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...


మీకు సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఈ అనుకోని మలుపుతో ఏమనిపిస్తోంది?

అవకాశం కోసం నేను కలగనలేదు. ‘వీరంగం’ దర్శకుడు నన్ను టీవీలో చూసి ఆఫర్‌ చేశారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగినందుకు ఆనందిస్తున్నాను. కాకపోతే రేప్‌ సీన్ల వంటి ఇష్టంలేని సన్నివేశాల్లోనూ నటించాల్సి వచ్చింది.


పెద్ద హీరోల సరసన హీరోయిన్‌ పాత్రలు వస్తే.. ఎక్స్‌పోజింగ్‌ చేస్తారా?

మరీ ఎక్స్‌పోజింగ్‌ నావల్ల కాదు. అలాగే.. ఇకపై జోగినిగా కొనసాగాలని లేదు.


పొగరు, తల బిరుసు.. ఎలా వచ్చాయి మీకు?

నేనలా అనుకోను. నా తత్వమే అంత. అంతేగానీ, నా పొగరుకు అందం కారణం కాదు. నాకు జీవితం ఎన్నో నేర్పింది. అక్క చనిపోయినప్పుడు పడ్డ బాధ చెప్పలేనిది. ఆమెను ఎవరో చంపేశారు. ఒళ్లంతా కాలిన స్థితిలో ఆమెను చూసి తట్టుకోలేకపోయాను.


మీ ఖరీదైన జీవన శైలికి డబ్బెలా సమకూరుతుంది?

ఘటాలకు వె ళతాను. మిగతావారి కన్నా నాకే ఎక్కువ చెల్లిస్తారు. 30 వేల నుంచి 50వేల రూపాయల వరకు తీసుకుంటాను. కానీ ఒడి బియ్యం, 21 రూపాయలు తీసుకోవడంతో నా జీవితం మొదలైంది.


మిమ్మల్ని జోగినిగా ఎవరు ప్రకటించారు?

హైదరాబాద్‌లో కింది కులంలో పుట్టి పెరిగాను. నన్ను మా నానమ్మ జోగినిగా ప్రకటించింది. సాధారణంగా జోగినులను పట్వారీలు, దొరలు చేరదీస్తారు. నేను మాత్రం అమ్మానాన్నల దగ్గరే ఉన్నాను.


మీరు అసలు జోగిని కాదు.. ట్రాన్స్‌ జెండర్‌ అనే వాదన ఉంది?

అది వారిష్టం. ఉత్సవాల్లో లక్షలమంది నన్ను గుర్తుపడతారు. చిన్నప్పటినుంచి బోనాలు ఎత్తుతున్నా. మీరు చెబుతున్న పదాల్లాంటివి నాకు తెలీదు. నాలోకంలో నేనుంటా. నాకోసం ఉన్నవాళ్లకే ప్రాధాన్యమిస్తా.

Updated Date - 2020-02-07T21:07:25+05:30 IST