తండ్రికొడుకులే కాడెద్దులైన వేళ

ABN , First Publish Date - 2022-12-20T00:43:41+05:30 IST

పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన చింతల కృష్ణయ్య తన పొలంలో వంగతోట వేశారు.

తండ్రికొడుకులే కాడెద్దులైన వేళ

పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన చింతల కృష్ణయ్య తన పొలంలో వంగతోట వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తడిగా మారిన నేలలో విపరీతంగా కలుపు మొక్కలు పెరిగాయి. ఆర్థిక స్థోమత లేకనో, ఎద్దులు అందుబాటులో లేకనో కొందరు కాడీ, మేడీ పట్టి దున్నడం చూసే ఉంటాం. కానీ ఈయన మాత్రం పంట రక్షణ కోసం తనవాళ్లనే కాడెద్దులుగా మార్చాడు.ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వంగ పంటను ఎద్దులైతే పాడు చేస్తాయని భావించాడు. తానే మేడి పట్టాడు. కుమారులు ఎల్లయ్య, మహేష్‌, తమ్ముళ్లు వెంకటయ్య, సుబ్రహ్మణ్యం కాడి పట్టుకుని వంగ చెట్ల మధ్య దున్ని పాదులు చేశారు. వాస్తవానికి గతంలో రోజుల తరబడి కాడెద్దులతో పొలం దున్ని దుక్కిచేసి సాగు చేసేవారు. యంత్రాలు వచ్చాక అలాంటి సేద్యం ఎక్కడా కనిపించడంలేదు.

-పెళ్లకూరు

Updated Date - 2022-12-20T00:43:43+05:30 IST