జిల్లా స్కూల్‌ గేమ్స్‌ క్రికెట్‌ జట్ల ఎంపికలు

ABN , First Publish Date - 2022-12-20T00:34:01+05:30 IST

జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అం డర్‌-14, 17 క్రికెట్‌ టీమ్‌ల ఎంపికకు రో టరీ క్లబ్‌ ఆఫ్‌ నిడద వోలు వేదిక కావడం అభినందనీయమని రో టరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ అయినీడి పల్లారా వు అన్నారు. సోమవా రం నిడదవోలు మండలం తాడిమళ్లలో జి ల్లా ప్రభుత్వోన్నత పాఠ శాలలో క్రికెట్‌ క్రీడాకా రుల ఎంపిక పోటీలు నిర్వహించారు.

జిల్లా స్కూల్‌ గేమ్స్‌ క్రికెట్‌ జట్ల ఎంపికలు

నిడదవోలు, డిసెంబరు 19: జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అం డర్‌-14, 17 క్రికెట్‌ టీమ్‌ల ఎంపికకు రో టరీ క్లబ్‌ ఆఫ్‌ నిడద వోలు వేదిక కావడం అభినందనీయమని రో టరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ అయినీడి పల్లారా వు అన్నారు. సోమవా రం నిడదవోలు మండలం తాడిమళ్లలో జి ల్లా ప్రభుత్వోన్నత పాఠ శాలలో క్రికెట్‌ క్రీడాకా రుల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 125 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్కూల్‌ గేమ్స్‌ ప్రధాన కార్యదర్శి డి.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఎంపికైన క్రికెట్‌ క్రీడాకారుల జట్టు జిల్లా తరపున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, ఎండీ ఫయాజ్‌, గుంటుపల్లి శివ, సర్పంచ్‌ బయ్యే రాధారాణి, జడ్పీటీసీ కొయ్యే సూరిబాబు, ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ కొప్పుల నాగేశ్వరరావు, హెచ్‌ఎం గురుమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-20T00:34:03+05:30 IST