హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2022-12-07T01:31:12+05:30 IST

హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ మలికగర్గ్‌ కొనియాడారు. మంగళవారం స్థానిక పోలీసు మైదానంలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కవాతు నిర్వహించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోంగార్డులు పోలీసు శాఖలో అంతర్భాగమని పేర్కొన్నారు.

హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి

ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు(క్రైం), డిసెంబరు 6 : హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ మలికగర్గ్‌ కొనియాడారు. మంగళవారం స్థానిక పోలీసు మైదానంలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కవాతు నిర్వహించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోంగార్డులు పోలీసు శాఖలో అంతర్భాగమని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో అత్యంత నైపుణ్యం కబరుస్తూ పోలీసుకు దీటుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచుతున్నారని అభినందించారు. ఇటీవల పామూరు ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల ముఠాను పట్టుకోవడంలో హోంగార్డుల కృషి ప్రశంసనీయమన్నారు. వారి సంక్షేమం కోసం అనేక పఽథకాలు అమలు చేస్తున్నామని చెప్పా రు. అంతేకాకుండా కారుణ్య నియా మకాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కవాతు కమాండర్‌ జి.హనుమంతరావు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌.కె.మహబూబ్‌ బాషా, సాంబనాయక్‌, డి.రమణయ్యలకు ఎస్పీ జ్ఞాపికలను అందజేశారు. అనంతరం హోంగార్డులు ర్వాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.నాగేశ్వరావు, ఏఎస్పీ (క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు, ఏఆర్‌ ఏఎస్పీ ఆశోక్‌బాబు, ఎస్బీ డీఎస్పీ బి.మరియదాస్‌, డీఎస్పీలు రామకృష్ణ, శ్రీనివాసరావు, సీఐలు దేవప్రభాకర్‌, రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:31:14+05:30 IST