ఇంటర్‌ చదివేందుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-17T23:05:21+05:30 IST

ప్రైవేటుగా ఇంటర్మీడియట్‌ చదువుకోవాలనుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఐవో ఎస్‌.తవిటినాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌ చదివేందుకు దరఖాస్తుల ఆహ్వానం

అరసవల్లి, నవంబరు 17: ప్రైవేటుగా ఇంటర్మీడియట్‌ చదువుకోవాలనుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఐవో ఎస్‌.తవిటినాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్‌ గ్రూపు చదవాలనుకునే విద్యార్థు లు, గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకోవాలన్నారు. బైపీసీ విద్యార్థులు రూ.1310 చలానాను యూనియన్‌ బ్యాంకులో తీసి దరఖాస్తు చేసుకోవాలన్నా రు. దరఖాస్తును హెటీటీపీఎస్‌//బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుకు 2 ఫొటోలు, పదో తరగతి మార్కుల మెమో, టీసీని జత చేయాలన్నారు. వీటిని గుంటూరులోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం అడ్రాస్‌కు ఈ నెల 30వ తేదీలోగా పంపించాలన్నారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2022-11-17T23:05:24+05:30 IST