Home » Andhra Pradesh » Srikakulam
రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది.
ఈ ఏడాది జిల్లాలో అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్పస్వామి మాల ధరించారు.
మార్కెట్లో మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలంతో రైతులకు, వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర దక్కడం లేదు. మరోవైపు వినియోగదారులకు మార్కెట్లో బియ్యం ధర ఏ మాత్రం తగ్గడం లేదు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. అన్నదాతలు దళారుల దగాకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ నెల 17 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆదేశించింది. కానీ జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేంద్రంలో కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు.
భావనపాడు సాగరతీరంలో హార్బర్ ప్రతిపాదన నాలుగు దశాబ్దాలుగా నలుగుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మత్స్యకారుల కల నెరవేర్చాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
ఉద్యాన పంటలకు ఊతమిచ్చేలా.. మెట్ట ప్రాంతాల రైతులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉపాధిహామీ నిధులను ఉద్యానశాఖకు అనుసంధానం చేసి రైతులకు ఉపాధి కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే ట్రూఅప్ చార్జీలు రద్దుచేయాలని, స్మార్ట్‌మీటర్లు బిగింపు ప్రక్రయ నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ ఢిమాండ్ చేశారు. బుడుమూరు సబ్‌స్టేషన్ వద్ద సీపీఎం నాయకులు నాగరాజు, అశోక్, శ్రీనివాసరావు ధర్నా నిర్వహించారు.
గంజాయి అక్రమ రవాణాపై దృష్టిసారించాలని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. బుధవారం ఇచ్ఛాపురం టౌన్ పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు.
జిల్లాలోని అరసవల్లి, కళింగపట్నంలో నిర్వహించిన సాగర్ కవచ్‌లో భాగంగా రెడ్‌ఫోర్స్ విశాఖపట్నం నేవీ బృందాన్ని మెరైన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు ఐదోతేదీన సాగర్ కవచ్ నిర్వహించిన విషయం విదితమే.
వెలుగు వీవోఏలకు మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దుచేయాలని ఏపీ వెలుగు వీవోఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయు డు, పి.తేజేశ్వరరావు డిమాండ్‌చేశారు. వీవోఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్వంలో కలెక్టరేట్‌వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.