Share News

మూడేళ్ల కాలపరిమితిని రద్దు చేయాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:40 PM

వెలుగు వీవోఏలకు మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దుచేయాలని ఏపీ వెలుగు వీవోఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయు డు, పి.తేజేశ్వరరావు డిమాండ్‌చేశారు. వీవోఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్వంలో కలెక్టరేట్‌వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.

 మూడేళ్ల కాలపరిమితిని రద్దు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వెలుగు వీవోఏలు:

అరసవల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వెలుగు వీవోఏలకు మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దుచేయాలని ఏపీ వెలుగు వీవోఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయు డు, పి.తేజేశ్వరరావు డిమాండ్‌చేశారు. వీవోఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్వంలో కలెక్టరేట్‌వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. తొలుత ఆర్‌అం డ్‌బీ బంగ్లా రోడ్డు నుంచి ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. మహిళా మార్ట్‌ల్లో కొనుగోళ్లకు సంబంధించి వీవోఏలకు టార్గెట్లు ఇవ్వడం ఆపాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూజిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, వీఓఏలసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు ఎం.ప్రభావతి, జి.అసిరినాయుడు, డి.జోగారావు, వై.అనూరాధ, వై.హేమలత, వై.ఎర్రయ్య, సురేష్‌, ఎం.శోభారాణి, జి.శ్రీనివాసరావు, ఎస్‌.లక్ష్మి, రాజేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:40 PM