Share News

అనుమానాస్పదంగా తిరిగి.. ఆర్డీఎక్స్‌ అమర్చి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:42 PM

జిల్లాలోని అరసవల్లి, కళింగపట్నంలో నిర్వహించిన సాగర్‌ కవచ్‌లో భాగంగా రెడ్‌ఫోర్స్‌ విశాఖపట్నం నేవీ బృందాన్ని మెరైన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు ఐదోతేదీన సాగర్‌ కవచ్‌ నిర్వహించిన విషయం విదితమే.

అనుమానాస్పదంగా తిరిగి.. ఆర్డీఎక్స్‌ అమర్చి
కళింగపట్నం లైట్‌హౌస్‌ వద్ద పట్టుబడిన రెడ్‌ఫోర్స్‌ బృందం:

శ్రీకాకుళం క్రైం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అరసవల్లి, కళింగపట్నంలో నిర్వహించిన సాగర్‌ కవచ్‌లో భాగంగా రెడ్‌ఫోర్స్‌ విశాఖపట్నం నేవీ బృందాన్ని మెరైన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు ఐదోతేదీన సాగర్‌ కవచ్‌ నిర్వహించిన విషయం విదితమే. తాజాగా రెండోసారి బుధ, గురువారాల్లో సాగర్‌ కవచ్‌ను మెరైన్‌ పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డమ్మీ ఆర్డీఎక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఫ కళింగపట్నంలోని లైట్‌హౌస్‌లో బుధవారం ఉదయం 10:20 నిమిషాలకు రెడ్‌ ఫోర్స్‌ బృందం డమ్మీ ఆర్డీఎక్స్‌ బాంబు పెట్టేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో మెరైన్‌ సీఐ ప్రసాదరావు ఎస్‌ఐలు వి.బాలకృష్ణ, కె.మహాలక్ష్మి, ఏఎస్‌ఐ వైకుంఠ రావు, హెచ్‌సీ శ్యామలరావు,బాపూజీ, బీవీ ప్రసాద్‌, రాంబాబు, దుర్గారావులు పట్టుకుని గార పోలీసుస్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు నిర్వహించి రెడ్‌ఫోర్స్‌ బృందానికి చెందిన వారిగా గుర్తించారు.తర్వాత పోలీసులు వారిని విడిచిపెట్టగా మళ్లీ అరసవల్లి ఆలయంలో బాంబు పెటేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు.

ఫశ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో డమ్మీ ఆర్డీఎక్స్‌ బాంబ్‌ అమర్చేందుకు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సాధారణ భక్తుల మాదిరిగా ఆలయానికి ఇద్దరు వ్యక్తులు మెడలో తువ్వాలు ధరించి బ్యాగ్‌తో వచ్చారు.ఆలయం బయట అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐ బర్ల ప్రసాదరావు తనిఖీలు నిర్వహించారు. బ్యాగులో డమ్మీ ఆర్డీఎక్స్‌ బాంబును గుర్తించిన మెరైన్‌ పోలీసులు వారిని పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఇద్దరు రెడ్‌ ఫోర్స్‌ బృందాన్ని మెరైన్‌ సీఐ బర్ల ప్రసాదరావు సిబ్బందితో పట్టుకున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:42 PM