రబీకి నీరివ్వలేం: జడ్పీ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-11-24T23:58:26+05:30 IST

జిల్లాలో ఉపాధి హమీ, జైకానిధులతో పంటకాలువల్లో పనులు జరుగు తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా రబీ పంటలకు నీరు అందిచడంలేదని, ఆరుతడి పంటలు వేసుకోవాలని జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు

రబీకి నీరివ్వలేం: జడ్పీ చైర్మన్‌

విజయనగరం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హమీ, జైకానిధులతో పంటకాలువల్లో పనులు జరుగు తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా రబీ పంటలకు నీరు అందిచడంలేదని, ఆరుతడి పంటలు వేసుకోవాలని జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖ రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికీ తా గునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీని లో భాగంగా ఇప్పటికే జలజీవన్‌ మిషన్‌ ద్వారా జిల్లా వ్యా ప్తంగా రూ.840 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఏడాదిలో పూర్తిచేసి 2.5 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించనున్నామన్నారు.

Updated Date - 2022-11-24T23:58:28+05:30 IST