అదే ఆర్థ్రయిటిస్‌కు విరుగుడు

ABN , First Publish Date - 2022-10-18T19:50:43+05:30 IST

ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ ద్యాన్‌ క్యూర్‌’ అనే మాట ఆర్థ్రయిటిస్‌కూ వర్తిస్తుంది. యోగాభ్యాసం ఎంత చిన్న వయసులో మొదలుపెడితే

అదే ఆర్థ్రయిటిస్‌కు విరుగుడు

‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ ద్యాన్‌ క్యూర్‌’ అనే మాట ఆర్థ్రయిటిస్‌కూ వర్తిస్తుంది. యోగాభ్యాసం ఎంత చిన్న వయసులో మొదలుపెడితే, ఆర్థ్రయిటిస్‌ను అంత సమర్ధంగా నియంత్రించుకోవచ్చు. ఆర్థ్రయిటిస్‌ను అరికట్టే యోగాసనాలు ఇవే!

 

సమస్థితి/తాడాసనం

నిటారుగా నిలబడి, చేతులు పైకి లేపి, అరచేతులు ఆనించాలి. ఇలా నిలబడినప్పుడు శరీర బరువు రెండు కాళ్ల మీద సమంగా పడేలా చూసుకోవాలి. భుజాలను వదులుగా ఉంచి, పొత్తికడుపును బిగించాలి. ఈ భంగిమలో నిలబడి 8 నుంచి 10 సార్లు శ్వాస పీల్చుకుని వదలాలి. 


పశ్చిమోత్తనాసనం

నేల మీద కూర్చుని, కాళ్లను ముందుకు చాపాలి. ఇలా కూర్చున్నప్పుడు మోకాళ్లు స్వల్పంగా వంగేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచి, నెమ్మదిగా ముందుకు వంగి, మేచేతులు నేలకు తగిలేలా ఉంచి, రెండు చేతులతో కాలి వేళ్లను దగ్గరకు లాగాలి. ఈ భంగిమలో తలను మోకాళ్లకు ఆనించాలి. ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదులుతూ, పైకి లేచేటప్పుడు శ్వాస పీల్చుకోవాలి.
ధనుర్వాసనం

బోర్లా పడుకుని, మెకాళ్లను వెనక్కి మడవాలి. తర్వాత రెండు చేతులతో కాలి గిలకలను పట్టుకోవాలి. చేతులు, కాళ్లను సాధ్యమైనంత పైకి లేపాలి. ఈ భంగిమలో తలను పైకి లేపి పైకి చూస్తూ ఉండాలి.


ప్రాణాయామ/కపాలభాతి

కపాలం అంటే ‘పుర్రె’, భాతి అంటే ‘కాంతి’ అని సంస్కృత అర్థం. సుఖాసనం, అర్థ పద్మాసనం లేదా పద్మాసనం... ఇలా ఏదైనా సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. ఈ భంగిమలో కళ్లు మూసుకుని, వెన్ను నిటారుగా ఉంచి, అర చేతులు మోకాళ్ల మీద ఉంచాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస పీల్చుకుని, పొట్టను లోపలికి లాక్కుంటూ శ్వాసను పూర్తిగా బయటకు వదలాలి.


జల ధ్యానం

ఇదొక జల సంబంధ ధ్యానం. ఈ ధ్యానంలో భాగంగా ‘నీరు నాకు మేలైనది, పవిత్రమైనది’ అని మనసులో స్మరించుకోవాలి. ఇలా స్మరించి నీళ్లు తాగడం వల్ల శరీర శుద్ధి జరిగి, నీటికున్న అపూర్వమైన శక్తి శరీరానికి అందుతుంది. ఈ ధ్యానం కోసం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. Updated Date - 2022-10-18T19:50:43+05:30 IST