Somalia: జంట కారు బాంబు పేలుళ్లు, 100 మంది మృతి

ABN , First Publish Date - 2022-10-30T20:11:57+05:30 IST

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రద్దీగా ఉండే జంక్షన్‌లో రెండు శక్తివంతమైన కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ ఘటన జరిగింది.

Somalia: జంట కారు బాంబు పేలుళ్లు, 100 మంది మృతి

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రద్దీగా ఉండే జంక్షన్‌లో రెండు శక్తివంతమైన కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ ఘటన జరిగింది. మొదటి పేలుడు సంభవించిన కొద్ది సేపటికే రెండో పేలుడు జరగడంలో పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల పలు భవనాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని అధ్యక్షుడు హస్సన్ షేక్ మొహమూద్ తెలిపారు. క్షతగాత్రుల చికిత్స కోసం ఇంటర్నేషనల్ మెడికల్ హెల్ప్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఆగస్టులో మొగదిషులోని ఓ ప్రఖ్యా హోటల్‌పై జరిగిన దాడిలో 21 మంది మరణించడంతో ఇస్లామిస్ట్ మిలిటెంట్లపై సంపూర్ణ యుద్ధాన్ని మొహమూద్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజా దాడులు జరిగినట్టు భావిస్తున్నారు.

Updated Date - 2022-10-30T20:12:44+05:30 IST