2022 Shocking Facts: 2022లో ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల మంది పిల్లలు పుడితే.. ఒక్క భారత్‌లోనే ఏకంగా..

ABN , First Publish Date - 2022-12-31T17:33:25+05:30 IST

మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం (new year) రాబోతోంది. 2022కి గుడ్‌బై చెప్పి, 2023లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ 2022కు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాదిలో..

2022 Shocking Facts: 2022లో ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల మంది పిల్లలు పుడితే.. ఒక్క భారత్‌లోనే ఏకంగా..

మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం (new year) రాబోతోంది. 2022కి గుడ్‌బై చెప్పి, 2023లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ 2022కు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాదిలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే మరెన్నో వింతలు, విశేషాలూ జరిగాయి. ఇప్పటికే వాటన్నింటినీ చాలా వార్తల్లో చూసి ఉంటారు. కానీ చాలా మందికి తెలియని.. 2022లో చోటు చేసుకున్న కీలక పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Viral Video: స్టేషన్ రాకముందే బోగీ డోరు వద్ద నిల్చున్న మహిళ.. సడన్‌గా పైకి వచ్చిన యువకుడు..

భారతదేశ ప్రస్తుత జనాభా (Population of India) 141కోట్ల వరకు చేరుకుంది. జనాభా పెరుగుదల రేటు ఇలాగే మరో ఏడాదిలో దేశ జనాభా చైనాను మించిపోయే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రతి ఏడాదీ ప్రపంచ వ్యాప్తంగా సంభవించే జననాల్లో భారత దేశమే ముందు వరసలో ఉంది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 13కోట్ల మంది పిల్లలు పుడితే.. ఒక్క భారత్‌లోనే 2.50కోట్ల మంది జన్మించారు. అదేవిధంగా ‘‘ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ 2022’’ ప్రకారం, భారతదేశంలో 220 మిలియన్లకు పైగా ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిసింది. అలాగే వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ రీసెర్స్ ప్రకారం.. భారతదేశంలో ప్రతి లక్ష మందికి 62 మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.

New Year celebrations: న్యూఇయర్ వేళ.. పబ్స్ నిర్వాహకులకు హైకోర్టు షాక్.. ఇక ఆ పప్పులు ఉడకవ్..

new.jpg

అడవులు తరిగిపోతున్నాయనే ఆందోళన నేపథ్యంలో 2022లో భారత్ కాస్త మెరుగ్గానే ఉంది. India State of Forest Report 2021 ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో అటవీ విస్తీర్ణం 1540 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఈ ఏడాది బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్‌లో అత్యధిక అటవీ నిర్మూలన జరిగింది. 2022లో మొత్తం 48 లక్షల ఎకరాల్లో అమెజాన్‌ అడవుల్లో సాగు జరిగినట్లు తెలిసింది. ఇదిలావుండగా, చైనా ప్రతి ఏడాదీ సగటున 1,000 టన్నుల కార్బన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ జాబితాలో 541 టన్నుల కార్బన్‌తో అమెరికా రెండో స్థానం, 265 టన్నుల కార్బన్‌తో భారత్ మూడో స్థానంలో నిలిచాయి.

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

ఇక నీటి వినియోగానికి సంబంధించి.. చైనాలో గరిష్టంగా 362 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు, అమెరికాలో 216 లక్షల కోట్ల గ్యాలన్లు. భారత్‌లో 40 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు ఉపయోగించబడింది. ఇక, ఇంటర్నెట్ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో ఇంటర్నెట్ వినియోగదారులు (Internet users) ఉన్నారు. ఇక్కడ 102 కోట్లకు పైగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. అలాగే 2022లో భారత్‌లో 65 కోట్ల మందికి పైగా ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా భారత్‌లో IPL, CoWIN, FIFA వరల్డ్ కప్, ఆసియా కప్, ICC T-20 వరల్డ్ కప్ వివరాల గురించి ఎక్కువగా శోధించారు.

మూడో భర్త వీడియో కాల్ చేయగా.. రెండో భర్తతో కలిసి మాట్లాడిన మహిళ.. రాత్రి ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం..

India.jpg

ప్రపంచంలో అతిపెద్ద US స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన NYSE (New York Stock Exchange) మార్కెట్ క్యాప్.. 2022 డిసెంబర్‌లో రూ. 1821 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. కాగా, భారత స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్.. రూ.281 లక్షల కోట్లకు పైగా ఉంది. మరోవైపు ఆహార ధాన్యాల విషయానికి వస్తే.. చైనాలో గరిష్ఠంగా 90 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2022లో దేశంలో 6 కోట్ల టన్నులకు పైగా ఆహార ధాన్యాలు వృథా అయినట్లు తెలిసింది. ఇక, డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ ముందు వరుసలో ఉంది. 2022లో దేశంలో 7000 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అలాగే 2000 కోట్ల డిజిటల్ లావాదేవీలతో చైనా రెండో స్థానంలో ఉంది.

The world's most unlucky Groom: పాపం.. పెళ్లి రోజే అందరినీ కోల్పోయాడు.. కుటుంబంలో ముగ్గురే మిగిలారు..!

మరణాల రేటు విషయంలో ప్రపంచంలో సెర్బియా అగ్రస్థానంలో ఉంది. 2022లో ఇక్కడ ప్రతి 1000 మందికి 16 మరణాలు సంభవించాయి. ఈ జాబితాలో భారత్ 31వ స్థానంలో ఉంది. మన దేశంలో ప్రతి 1000మందికి సగటున 10 మంది మరణించారు. అలాగే లక్షా 64 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. బొగ్గు వెలికితీత విషయంలో ప్రపంచంలో చైనా ముందు వరుసలో ఉంది. ఈ దేశంలో 394కోట్ల టన్నుల బొగ్గును వెలికితీశారు. ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. మన దేశంలో 760 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికి తీశారు.

నర్సును ప్రేమించిన వార్డు బాయ్.. ప్రియురాలు చెప్పిన మాటతో వైద్యురాలి వద్దకు వెళ్లి..

Updated Date - 2022-12-31T17:36:38+05:30 IST