Hyderabad Book Fair : వంశవృక్షాన్ని, వారి వృత్తుల్ని రచనలో చెప్పుకురావడం ఆమెకే సాధ్యమైంది..!
ABN , First Publish Date - 2022-12-29T20:30:05+05:30 IST
కలెనేతపై ఉస్మానియా యూనివర్సిటిలో చర్చకు పెట్టాలని తెలుగు శాఖ ప్రోఫెసర్.కాశీంకు విజ్జాప్తి చేశారు
బల్ల సరస్వతి తన జీవితకాలంలో చూసిన సంఘటనలను, విశేషాలు దాదాపు వందా నూటఇరవై ఏళ్ల జీవన విధానాన్ని, బ్రతుకు పోరాటాన్ని, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను తన ఆత్మకథలో చెప్పుకొచ్చింది. ఇందులో ప్రస్తావించిన అనేక విషయాల్లో మన జీవితాల్లోనూ, మన ఇళ్లలోనూ జరిగేవే అనిపిస్తాయి. కానీ వాటన్నింటినీ గుర్తు పెట్టుకొని డైరీ రాసినట్లు రచన చేయడమంటే, రాయడమంటే సాధ్యపడే విషయం కాదు. తాత ముత్తాల వంశాలను, వంశవృక్షాన్ని, వారి వృత్తుల్ని రచనలో చెప్పుకురావడం ఆమెకే సాధ్యమైంది. బల్ల సరస్వతి కలెనేత ఏడు తరాల తలపోత ఆత్మకథ పరిచయ సభ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బల్ల సరస్వతి కలెనేత ఆత్మకథను పుస్తకావిష్కరణ సభలో రచయిత రిటైడ్ ఐఎయస్ చిరంజీవుల, రచయిత, విమర్శకులు అంబటి సురేందర్ రాజు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, ప్రోఫెసర్ హరగోపాల్, రచయిత జూపాక సుభద్ర పాల్గొన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరి శంకర్ మాట్లాడుతూ..పద్మశాలీ కుటుంభీకులు తమ ఇంట్లో గర్వంగా, భద్రంగా దాచుకోవాల్సిన పుస్తకం కలెనేత అన్నారు. కలెనేతపై ఉస్మానియా యూనివర్సిటీలో చర్చకు పెట్టాలని తెలుగు శాఖ ప్రోఫెసర్.కాశీంకు విజ్జాప్తి చేశారు.
అబంటి సురేందర్ రాజు మాట్లాడుతూ...బల్ల సరస్వతి కలెనేత ఏడు తరాల తలపోతలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి వరకు విస్తారమైన జీవితం ఎడు తరాల చరిత్రను బల్ల సరస్వతి ఉంచారు. ఎనిమిది దశాబ్దాల జీవితంలో నాటి మానిషి జీవితం, వారు పడ్డ కష్టాలను, మనుషుల జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపిందని అన్నారు.
రిటైర్డ్ ఐఎయస్ చిరంజీవులు మాట్లాడుతూ ..పద్మశాలీలు తమ నేత వృత్తిలో అనేక రంగులు ఏలా ఉంటాయో ఈ కలెనేతలో విప్లవభావాలు, బిసి కులవృత్తులు సాధక బాధకాలను రచియిత ఆత్మకథలో పేర్కొన్నారని తెలిపారు. రచయిత జూపాక సుభద్ర మాట్లాడుతూ.. 7 తరాల చరిత్రను ఒక రిజర్వాయర్ గా తన అనుభవాలను నిక్షిప్తం చేశారని అన్నారు. ప్రోఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ..తెలుగులో మహిళ రచయితల్లో ఇద్దరు మాత్రమే ఆత్మకథలు వ్రాసారని అందులో బల్లసరస్వతి ఒకరని అన్నారు.