BJP: కొత్త ఏడాది నుంచే వ్యూహాల అమలుకు బీజేపీ ప్రణాళిక
ABN , First Publish Date - 2022-12-29T16:25:27+05:30 IST
శామీర్‌పేట లియోనియా రిసార్ట్స్‌లో బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santhosh) ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది.
హైదరాబాద్: శామీర్‌పేట లియోనియా రిసార్ట్స్‌లో బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santhosh) ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే చతుర్మఖ వ్యూహంతో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ భేటీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సహా.. తెలంగాణ (Telangana) బీజేపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గానికి కన్వీనర్లు, పాలక్, విస్తారక్, ప్రభారీల నియామించారు. నియోజకవర్గాల్లో పని విధానంపై బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారు. అలాగే 119 అసెంబ్లీ (Assembly) నియోజకవర్గాలకు పాలక్‌లు నియామించారు. నెలలో 3 రోజులు ఆయా నియోజకవర్గాల్లో పాలక్‌లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల స్థితిగతులపై అధిష్టానానికి పాలక్‌లు నివేదికలు ఇవ్వనున్నారు. పలువురు మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్‌లుగా బండి సంజయ్ నియమించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం.. అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లను నియమించనున్నట్లు తెలిసింది. కొత్త ఏడాది నుంచే వ్యూహాల అమలుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది.