Home » BJP
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.
హరియాణా ఎన్నికల్లో ఇండియా కూటమి ఐక్యత కొత్త చరిత్రను లిఖింస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) పేర్కొన్నారు.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రికార్డు సమయంలో సహాయ చర్యలు చేపడుతున్నాయి. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాం’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురా లు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పాలిట దశమ గ్రహం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు.
వరదపై రాజకీయాలు చేయకుండా తక్షణమే భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ రోడ్డు మీద పడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో ఈరోజు(శుక్రవారం) దిశా కమిటీ మీటింగ్ జరిగింది.
కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.18,000 ఇచ్చేందుకు 'మా సమ్మాన్ యోజన' అనే పథకం తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల స్కీమ్ కింద ఏటా రెండు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. కాలేజీ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్‌గా ఏటా రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చింది.
వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆర్మీ జవాన్లతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టింది.
కర్ణాటకలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ ఈ నివేదికను ఆగస్టు 30నే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపైౖ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించినట్లు తాజాగా వైట్ హౌస్ వెల్లడించింది.