Share News

BJP: కొత్త అధ్యక్షుడి నియమాకం అప్పుడే.. తేల్చేసిన బీజేపీ అధిష్ఠానం

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:16 AM

బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా(JP Nadda) పదవీకాలం ముగియడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారోనని ఆసక్తికరంగా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు భావించగా.. తాజాగా ఆగస్టు నెల చివరినాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

BJP: కొత్త అధ్యక్షుడి నియమాకం అప్పుడే.. తేల్చేసిన బీజేపీ అధిష్ఠానం

ఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా(JP Nadda) పదవీకాలం ముగియడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారోనని ఆసక్తికరంగా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు భావించగా.. తాజాగా ఆగస్టు నెల చివరినాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం 2024 జూన్‌లో ముగిసింది. అయితే గతేడాది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం, పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన అధికారంలో ఉంటారు. కానీ మోదీ 3.0 సర్కార్‌లో నడ్డాకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడంతో తదుపరి అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జనరల్ సెసీ (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్‌లతో బుధవారం సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. సంతోష్, నడ్డా బయటకి వెళ్లాక మోదీ, అమిత్ షా(Amith Shah)తో ఇరువురు సమావేశమయ్యారు.

తదుపరి బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు అనేదే వీరి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పోటీలో ఉన్నది ఎవరనే విషయాన్ని బీజేపీ అధికారికంగా చెప్పలేదు. ఇదే సమయంలో.. గురు, శుక్ర వారాల్లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో బీజేపీ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో 2024 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పనితీరుపై నేతలు సమీక్షించనున్నారు.


మహారాష్ట్ర నేతలతో మోదీ భేటీ..

మహారాష్ట్ర అంసెబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల్లో నగారా మోగనున్న వేళ.. ఆ రాష్ట్రంలోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో మోదీ చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీ (అజిత్) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.


అమిత్ షాతో అజిత్ భేటీ.. ఆ కొద్ది గంటలకే..

ఆ కొద్ది గంటలకే ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ ఇలా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 80 నుంచి 90 సీట్లు కేటాయించాలని అమిత్ షాతో భేటీలో డిప్యూటీ సీఎం అజిత్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా సీట్ల సర్ధుబాటు విషయంలో ఎన్నికల చివర నిమిషం వరకు కాకుండా.. ముందే ఓ స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి అమిత్ ‌షాకు అజిత్ పవార్ విజ్జప్తి చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ చర్చించే అవకాశముందని సమాచారం.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 11:26 AM