Share News

Komatireddy Venkat Reddy: బీజేపీలో విలీనం దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:17 AM

బీజేపీలో విలీనం దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోందని, ఆ మేరకు తనకు, ముఖ్యమంత్రికి సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Komatireddy Venkat Reddy: బీజేపీలో విలీనం దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు

  • కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదు?: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీజేపీలో విలీనం దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోందని, ఆ మేరకు తనకు, ముఖ్యమంత్రికి సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాలకు రూ.లక్ష కోట్లకు మించి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే ప్రశంసించాల్సింది పోయి, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.


కేసీఆర్‌ని చూస్తే జాలేస్తోందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదని, ఇప్పటికైనా బీఆర్‌ఎ్‌సని మూసేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ గురించి కనీస ప్రస్తావన లేక పోయినా కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 03:17 AM