Actor Suman: సూపర్ స్టార్ అందరికీ సహాయం చేస్తూ.. ఇండస్ట్రీని కాపాడారు...

ABN , First Publish Date - 2022-11-15T12:35:25+05:30 IST

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మరణం పట్ల సినీ నటుడు సుమన్ (Suman) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Actor Suman: సూపర్ స్టార్ అందరికీ సహాయం చేస్తూ.. ఇండస్ట్రీని కాపాడారు...

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మరణం పట్ల సినీ నటుడు సుమన్ (Suman) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియో విడుదల చేశారు... కృష్ణ ఇక లేరంటే నమ్మలేకపోతున్నానన్నారు. ఆయన అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. ఒక యాక్టర్‌గా కాకుండా.. నిర్మాతలకు చాలా అనుకూలంగా ఉండేవారని, డబ్బులు, డేట్స్, అడ్జస్ట్‌ల విషయంలో ఎంతోమంది ప్రొడ్యూషర్స్‌ను ఆయన బతికించారన్నారు. ఎంతోమంది డైరెక్టర్స్‌కు అవకాశాలు ఇచ్చారని, అదేమాదిరిగా ఇండస్ట్రీని కాపాడారని కొనియాడారు. కృష్ణ చాలా మంచి వ్యక్తి అని, అందరితో బాగా ఉండేవారని అన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సుమన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Updated Date - 2022-11-15T12:36:28+05:30 IST