పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-11-21T03:52:47+05:30 IST

పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌)ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని.

 పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం

సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌)ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించి 2 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించింది. సీపీఎస్‌ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని, దీనిపై కాలయాపన తగదని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డి.కమలాకర్‌, భూపతిరావు ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పాతపెన్షన్‌ విధానం అమలు చేస్తున్నారని, మధ్యప్రదేశ్‌లోనూ సీపీఎ్‌సను రద్దు చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలన్నారు.

Updated Date - 2022-11-21T03:52:48+05:30 IST