భార్వాన్‌ టంగ్డి

ABN , First Publish Date - 2022-02-26T17:33:07+05:30 IST

చికెన్‌ లెగ్స్‌ - ఒక కేజీ, ఉప్పు - తగినంత, నిమ్మకాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, మటన్‌ ఖీమా - అరకేజీ, బ్రెడ్‌ క్రంబ్స్‌ - 30గ్రా, కోడిగుడ్లు - ఆరు, నల్లమిరియాలు - 50గ్రా, కారం - 50గ్రా, నూనె - ఒక లీటరు.

భార్వాన్‌ టంగ్డి

కావలసినవి: చికెన్‌ లెగ్స్‌ - ఒక కేజీ, ఉప్పు -  తగినంత, నిమ్మకాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, మటన్‌ ఖీమా - అరకేజీ, బ్రెడ్‌ క్రంబ్స్‌ - 30గ్రా, కోడిగుడ్లు - ఆరు, నల్లమిరియాలు - 50గ్రా, కారం - 50గ్రా, నూనె - ఒక లీటరు.


తయారీ విధానం: ముందుగా చికెన్‌ లెగ్స్‌ను నీళ్లతో శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మారినేట్‌ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్‌లో కోడిగుడ్ల పచ్చసొనను మాత్రమే తీసుకుని అందులో మిరియాలపొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మారినేట్‌ చేసుకున్న ఒక్కో చికెన్‌ లెగ్‌ను తీసుకుని అందులో మటన్‌ ఖీమాను కూరాలి. తరువాత లెగ్‌పీస్‌లకు మసాలా కలిపిన పచ్చసొనను కోటింగ్‌లా అద్దాలి. తరువాత బ్రెడ్‌క్రంబ్స్‌ను అద్దాలి. స్టవ్‌పై నూనె పెట్టి వేడి అయ్యాక లెగ్‌పీస్‌లు వేసి డీప్‌ఫ్రై చేసుకుంటే భార్వాన్‌ టంగ్డీ రెడీ.

Updated Date - 2022-02-26T17:33:07+05:30 IST