టర్పెండో పెప్పర్

ABN , First Publish Date - 2022-02-26T17:38:43+05:30 IST

దొడ్డు మిర్చి - 26, చీజ్‌ - 200గ్రా, క్యాప్సికం - 200గ్రా, నూనె - అరలీటరు, మైదా - 100గ్రా, కోడిగుడ్లు - రెండు, కార్న్‌ఫ్లేక్స్‌ - 200గ్రా, ఉప్పు

టర్పెండో పెప్పర్

కావలసినవి: దొడ్డు మిర్చి - 26, చీజ్‌ - 200గ్రా, క్యాప్సికం - 200గ్రా, నూనె - అరలీటరు, మైదా - 100గ్రా, కోడిగుడ్లు - రెండు, కార్న్‌ఫ్లేక్స్‌ - 200గ్రా, ఉప్పు - తగినంత, తెల్లమిరియాలు - 10గ్రా, టొమాటో సల్సా - 100గ్రా, పుల్లని క్రీమ్‌ - 100గ్రా, ఒరిగానో హెర్బ్స్‌ - ఒక టీస్పూన్‌. 


తయారీ విధానం: మిరపకాయలను శుభ్రంగా కడిగి నిలువుగా కట్‌ చేసి విత్తనాలు తీయాలి.ఒక బౌల్‌లో తురిమిన చీజ్‌, క్యాప్సికం ముక్కలు, ఒరిగాన్‌ హెర్బ్స్‌ తీసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిరపకాయల్లో కూరాలి.మరొక బౌల్‌లో కోడిగుడ్లు పగలకొట్టి అందులో మైదా, తెల్లమిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. చీజ్‌ కూరిన మిరపకాయలను ఈ మిశ్రమంలో ముంచుకుంటూ నలగ్గొట్టిన కార్న్‌ఫ్లేక్స్‌ను అద్దాలి.  స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిర్చీలు వేసి వేయించాలి. టొమాటో సల్సా, పుల్లని క్రీమ్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-02-26T17:38:43+05:30 IST