వర్క్యూ లుక్మే
ABN , First Publish Date - 2022-02-26T17:46:21+05:30 IST
మటన్ ఖీమా - ఒకకేజీ, నూనె - ఒక లీటరు, ఉప్పు - తగినంత, మైదా - ఒక కేజీ, పచ్చిమిర్చి - 100గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా.
కావలసినవి: మటన్ ఖీమా - ఒకకేజీ, నూనె - ఒక లీటరు, ఉప్పు - తగినంత, మైదా - ఒక కేజీ, పచ్చిమిర్చి - 100గ్రా, ఉల్లిపాయలు - 100గ్రా.
తయారీ విధానం: ఒక బౌల్లో మైదా పిండి తీసుకుని నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మటన్ ఖీమా వేసి ఉడికించాలి. మటన్ మెత్తగా ఉడికే వరకు చిన్న మంటపై వేయించాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని కొద్దిగా తీసుకుంటూ త్రిభుజాకారంలో ఒత్తుకోవాలి. దాని మధ్యలో ఖీమా మిశ్రమం పెట్టి చివర్లు దగ్గరకు ఒత్తాలి. స్టవ్‌పై మరో పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక వాటిని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.