మాగాయ
ABN , First Publish Date - 2022-05-28T18:02:41+05:30 IST
పల్లటి పచ్చిమామిడికాయ ముక్కలు - నాలుగు కప్పులు, ఉప్పు - అరకప్పు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్, కారం - అరకప్పు, మెంతిపొడి - మూడు టీస్పూన్లు, నూనె
కావలసినవి: పల్లటి పచ్చిమామిడికాయ ముక్కలు - నాలుగు కప్పులు, ఉప్పు - అరకప్పు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్, కారం - అరకప్పు, మెంతిపొడి - మూడు టీస్పూన్లు, నూనె - ముప్పావుకప్పు, ఆవాలు - మూడు టీస్పూన్లు, ఎండుమిర్చి - నాలుగు, ఇంగువ - ఒక టీస్పూన్.
తయారీ విధానం: ముందుగా మామిడికాయ ముక్కలను చిన్న ముక్కలుగా తరుగుకుని ఉప్పు, పసుపు వేసి రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మూడో రోజు ముక్కలు విడిగా, రసం విడిగా ఎండలో పెట్టాలి. ఆరేడు గంటలు ఎండిన తరువాత ముక్కలు రసం కలుపుకోవాలి. కారం వేయాలి.స్టవ్ పై బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేయాలి. ఈ పోపును పచ్చడిలో కలుపుకోవాలి. వారం రోజుల తరువాత పచ్చడి ఊరి ముక్క మెత్తబడుతుంది. అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది.