Share News

గజగౌరీదేవికి చక్కెర హారతులు

ABN , First Publish Date - 2023-11-29T00:27:44+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే గజగౌరీ ఉత్సవాలు రెండోరోజు ఘనంగా జరిగాయి.

గజగౌరీదేవికి చక్కెర హారతులు

బొమ్మన హాళ్‌, నవంబరు 28: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే గజగౌరీ ఉత్సవాలు రెండోరోజు ఘనంగా జరిగాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో గజగౌరీదేవికి మహిళలు భారీ ఎత్తున చక్కెర హారతులు ఇచ్చారు. మంగళవారం ఉద్దేహాళ్‌, ఉంతకల్లు, బొమ్మనహాళ్‌, నేమకల్లు, కురవళ్లి, సిద్ధరాంపురం, గోనేహాళ్‌, శ్రీధరఘట్ట, శింగానహళ్లి, కృష్ణాపురం, లింగదహాళ్‌, కొళగానహళ్లి, దేవగిరిక్రాస్‌ తదితర గ్రామాల్లోని మండపాలలోనూ, దేవాలయం వద్ద ఆవిష్కరించిన గజగౌరీదేవిని యువతులు, మహిళలు, చక్కెరహారతులు, నూతన వసా్త్రలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉద్దేహాళ్‌లో గజగౌరీదేవిని మంగళవారం రాత్రి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి, కొత్తపల్లి మల్లికార్జున, ఎస్పీ నాగరాజు, సంగప్ప, నవీన, దుర్గాప్రసాద్‌, బాబు, సైకిల్‌షాపు హనుమంత, మల్లీడు శీన, పయ్యావుల అనిల్‌, మహేంద్ర, మజ్జిగ నాగరాజు, మాలపాటి ధనుంజయ, పయ్యావుల మోహన, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:27:46+05:30 IST