Share News

బాబుతోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు

ABN , First Publish Date - 2023-11-29T00:08:43+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావి తరాలకు మార్గదర్శకుడని, ఆయనతోనే నవ్యాంధ్రకు బం గారు భవిష్యత్తు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

బాబుతోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు
ఇళ్ల వద్దకు వెళ్లి సిలిండర్లును ఉచితంగా అందించనున్నట్లు మహిళలకు వివరిస్తున్న గుండుమల తిప్పేస్వామి

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి

మడకశిరటౌన, నవంబరు 28: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావి తరాలకు మార్గదర్శకుడని, ఆయనతోనే నవ్యాంధ్రకు బం గారు భవిష్యత్తు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. పట్టణంలోని 1,3 వార్డులలో మంగళవారం బాబు ష్యూరిటీ భవి ష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహంచారు. టీడీపీ, జనసేన నాయకు లు కలసి పాల్గొన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని ఆదరించాలని, అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి భవిష్యత్తు అని వివరించారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ... వచ్చే 2024 ఎన్నికల్లో తెలు గుదేశం పార్టీ విజయం తథ్యమన్నారు. ముఖ్యమంత్రిగా జగనమోహనరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వవైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే తెలుగుదేశం పార్టీ బ లోపేతానికి ముందుకు సాగుదామన్నారు. ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తానని అధి కారంలోకి రాకమునుపు జగనమోహనరెడ్డి ప్రజలను నమ్మించారని, అధి కారంలోకి వచ్చాక కుటుంబంలో ఎంతమంది చదువుతున్నా ఒక్కరికే వర్తి స్తుందని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగనే మహిళాశక్తి పేరుతో సూపర సిక్స్‌ పథకాలను అందిస్తామని ప్రజలకు వివ రించారు. మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇవ్వడం వంటి ఎన్నో కార్యక్ర మాలు చేపడుతామని చంద్రబాబు స్పష్టంగా తెలిపారన్నారు. రాష్ట్ర భవిష్య త్తు కోసం చంద్రబాబు తప్పక రావాలని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. దళి తులపై జరుగుతున్న దాడులు అగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని సాగ నం పా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీని వాసమూర్తి, పట్టణాఽధ్యక్షుడు మనోహర్‌, మండల కన్వీనర్‌ లక్ష్మీ నారాయణ, డాక్టర్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణమూర్తి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, జిల్లా నాయీ రబ్రాహ్మణ సం ఘం అధ్యక్షుడు రామాంజనేయులు, తెలుగు యువత నాయకులు బేగార్లపల్లి రవి, నాగరాజు, తిమ్మరాజు, కౌన్సిలర్‌ ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:08:45+05:30 IST