Share News

రెండేళ్లకే రోడ్డుకు సొట్టలు..!

ABN , First Publish Date - 2023-11-29T00:26:27+05:30 IST

మండలంలోని కందుకూరు రోడ్డు చాలా అధ్వానంగా మారింది. రోడ్డు వేసి రెండేళ్లు పూర్తి కాకుండానే ఇరువైపులా రోడ్డు దెబ్బతిని గుంతలు ఏరపడ్డాయి. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.

రెండేళ్లకే రోడ్డుకు సొట్టలు..!
దెబ్బతిన్న కందుకూరు రోడ్డు

అధ్వానంగా మారిన కందుకూరు రోడ్డు

కనీస నాణ్యతా ప్రమాణాలు

పాటించని వైనం

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం

కారణంగా లేచిపోతున్న తారు

అనంతపురంరూరల్‌, నవంబరు28:

మండలంలోని కందుకూరు రోడ్డు చాలా అధ్వానంగా మారింది. రోడ్డు వేసి రెండేళ్లు పూర్తి కాకుండానే ఇరువైపులా రోడ్డు దెబ్బతిని గుంతలు ఏరపడ్డాయి. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం కారణంగా రోడ్డు దెబ్బతింటోందంటున్నారు. ఇప్పటికే రోడ్డు పై తారు లేచిపోతోంది. మరి కొన్ని చోట్ల ఇరుపక్కల రోడ్డు దెబ్బతింది. దీంతో ఆ రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిత్యం ప్రయాణం చేసే వారు ఇడెక్కడ రోడ్డు వేయడమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది గడవకుండానే..

మండలంలోని కందుకూరు నుంచి నగరానికి వచ్చే ప్రధాన రహదారితో పాటు, కందు కూరు నుంచి సెంట్రల్‌ స్కూల్‌ మీదుగా అనంతపురం- కదిరి ప్రధాన రహదారి వరకు రోడ్డు నిర్మాణాన్ని 2021 చివరిలో ప్రారంభించారు. రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు నిర్మించారు. గత ఏడాది జనవరిలో రోడ్డు స్థానిక ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రా రంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రస్తుతం కందుకూరు నుంచి పంగల్‌రోడ్డుకు వెళ్లే ఈ ప్రధాన రోడ్డు బాగా దెబ్బతింది. రోడ్డు నిర్మాణం తరువాత ఇరువైపులా తారు రోడ్డు కంటే ఎత్తుగా గ్రావెల్‌ వేయాల్సి ఉంది. ఆ పని చేయలేదు. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపుల మట్టి లేనికారణంగా గుంతలు పడి రోడ్డు దెబ్బతింది. దీంతో అటుగా ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎదురుగా ఏదైనా నాలుగుచక్రాల వాహనం వచ్చిందంటే.. అంతే సంగతి. ఏదైనా గుంతలో పడి డ్రైవరు, ప్రయాణిలు గాయాలపాలుకావడం ఖాయం అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంత అధ్వానంగా రోడ్లు వేయడం ఎన్నడూ చూడలేందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు నిర్మాణం అనంతరం సంబంధిత క్వాలిటీ కంట్రోల్‌ అథారిటీ అధికారులు రోడ్డును పరిశీలించి బిల్లుల చెల్లింపులకు సిఫారసూ చేయాల్సి ఉంది. రోడ్డు వేసి రెండుళ్లు కూడా పూర్తి కాకనే రోడ్డు దెబ్బతింటుంటే ఏవిధంగా బిల్లులకు సిపారసూ చేశారన్న విమర్శలు వ్యక్తం మవుతుండటం గమనార్హం.

Updated Date - 2023-11-29T00:26:30+05:30 IST