Share News

రేషన్‌ డోర్‌ డెలివరీ చేయకుంటే చర్యలు

ABN , First Publish Date - 2023-11-29T00:50:14+05:30 IST

రేషన్‌ను డోర్‌ డెలివరీ ఎండీయూ వాహనదారులపై చర్యలు తప్పవని జేసీ శ్రీనివాసులు హెచ్చరించారు.

రేషన్‌ డోర్‌ డెలివరీ చేయకుంటే చర్యలు

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 28: రేషన్‌ను డోర్‌ డెలివరీ ఎండీయూ వాహనదారులపై చర్యలు తప్పవని జేసీ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో రేషన్‌ పంపిణీపై డీఎ్‌సఓ శంకర్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం మోహన్‌బాబుతో కలిసి ఎండీయూ ఆపరేటర్లతో సమీక్షించారు. ప్రతి క్లస్టర్‌లోనూ 10 నుంచి 12 పాయింట్లు గుర్తించి రేషన్‌ పంపిణీ చేయాలన్నారు. డబుల్‌ బయోమెట్రిక్‌ కారణంగా నాలుగు నెలల రేషన్‌ పంపిణీలో చాల ఇబ్బందులు ఎదురవుతున్న సమస్యలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తెలిపి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-11-29T00:50:15+05:30 IST